: 68 పరుగుల వద్ద రెండో వికెట్ తీసిన టీమిండియా
అంటిగ్వాలో జరుగుతున్న తొలిటెస్టులో టీమిండియా ఆకట్టుకుంటోంది. 31 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో ఇన్నింగ్స్ ప్రారంభించిన వెస్టిండీస్ జట్టుకు టీమిండియా ఆటగాళ్లు కట్టుదిట్టంగా బంతులేశారు. ఓపెనర్ బ్రాత్ వైట్ తో మూడోరోజు ఇన్నింగ్స్ ఆరంభించిన నైట్ వాచ్ మన్ బిషు టీమిండియా పేసర్లు షమి, ఇషాంత్ ను సమర్ధవంతంగా అడ్డుకున్నారు. దీంతో వ్యూహం మార్చిన కోహ్లీ మిశ్రాను రంగంలోకి దించి 33వ ఓవర్ తొలి బంతికి ఫలితం సాధించాడు. ఊరించేలా బంతిని సంధించిన మిశ్రా ఉచ్చులో బిషు పడ్డాడు. బంతిని ఆడేందుకు ముందుకు వచ్చిన బిషు (12) కనీసం దానిని బీట్ చేయలేకపోయాడు. దీంతో సాహా దానిని అందుకుని వికెట్లను గిరాటేశాడు. రీప్లేలో అవుటైనట్టు తేలడంతో విండీస్ జట్టు 68 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది. బ్రాత్ వైట్ (35) క్రీజులో ఉండగా, అతనికి బ్రావో జత కలిశాడు.