: హోదా అనేది నిరంతర ప్రక్రియ... విశాఖకు రైల్వే జోన్ వస్తుంది: వెంకయ్యనాయుడు
ప్రత్యేకహోదా అనేది నిరంతర ప్రక్రియ అని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు తెలిపారు. విశాఖపట్టణంలో ఆయన మాట్లాడుతూ, ఏపీకి రెండేళ్లలో చేసినంత సాయం ఏ రాష్ట్రానికీ చేయలేదని అన్నారు. 9 నుంచి 14 రాష్ట్రాలు తమకు ప్రత్యేకహోదా కావాలని అడుగుతున్నాయని చెప్పారు. ప్రత్యేకహోదా ఇచ్చినంత మాత్రాన అన్నీ ఇచ్చేసినట్టు కాదని ఆయన తెలిపారు. ప్రత్యేకహోదా వల్ల అన్ని సమస్యలు తీరిపోవని ఆయన చెప్పారు. విశాఖకు రైల్వే జోన్ వస్తుందని ఆయన చెప్పారు. పార్టీలు మారడం ఒక జాడ్యమని ఆయన అన్నారు. అలా ప్రజా ప్రతినిధులు పార్టీలు మారినప్పుడు పదవులు కూడా వదిలెయ్యాలని ఆయన సూచించారు.