: తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త
ఉద్యోగార్థులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త తెలిపింది. గ్రూప్ 2లో గతంలో ప్రకటించిన 409 ఉద్యోగాలకు అదనంగా 593 ఉద్యోగాల భర్తీకి అనుమతినిచ్చింది. దీంతో ఈ ఉద్యోగాల సంఖ్య 1002 కు చేరింది. నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులు అదనంగా మరిన్ని ఖాళీలు చేరడంతో ఇప్పుడు హర్షం వ్యక్తం చేస్తున్నారు.