: ఆల్ ది బెస్ట్ చెప్పా...డబుల్ సెంచరీ చేస్తాడని ఊహించలేదు: వివ్ రిచర్డ్స్


టీమిండియా ప్రాక్టీస్ సెషన్ లో ఉండగా ఆటగాళ్ల దగ్గరకు వెళ్లి వారికి ఆల్ ది బెస్ట్ చెప్పానని... అయితే ఆ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ డబుల్ సెంచరీ చేస్తాడని ఊహించలేదని విండీస్ దిగ్గజ క్రికెటర్ వివియన్ రిచర్డ్స్ అన్నాడు. రెండో రోజు ఆట ముగిసిన అనంతరం ఆయన మాట్లాడుతూ, 'ఇంటర్నేషనల్ స్డేడియంలో ప్రాక్టీస్ సెషన్లో ఉన్న సమయంలో భారత ఆటగాళ్లను కలిశాను. ఆ సందర్భంగా విరాట్ కోహ్లీకి నేను ఆల్ ది బెస్ట్ చెప్పాను. అయితే ఈ విధంగా డబుల్ సెంచరీ సాధిస్తాడని మాత్రం అసలు ఊహించలేదు. ఇంతవరకు నేను కోహ్లీ సెంచరీ చేసిన ఏ మ్యాచ్ చూడలేదు. అయితే అతను డబుల్ సెంచరీ చేయడం చూశాను. ఈ ఇన్నింగ్స్ చూడని వారు చాలా మిస్ అయినట్టే. విండీస్ బయట తొలి డబుల్ సెంచరీ నేను చేసినట్టే కోహ్లీ కూడా విదేశాల్లోనే తొలి డబుల్ సెంచరీ చేశాడు. నిజానికి విదేశాల్లో ఆడుతున్నామంటే తీవ్ర ఒత్తిడి నెలకొంటుంది. దీంతో ఇన్నింగ్స్ ఆడడం కాస్త కష్టం. అయితే కోహ్లీ అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు' అని రిచర్డ్స్ పేర్కొన్నాడు.

  • Loading...

More Telugu News