: మామ వెంట బెజవాడ వచ్చిన ఎర్రన్నాయుడి కుమార్తె!.... ఆప్యాయంగా పలకరించిన చంద్రబాబు!
తూర్పు గోదావరి జిల్లాకు చెందిన వైసీపీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు నిన్న విజయవాడలో టీడీపీలో చేరిపోయారు. ఈ సందర్భంగా ఏర్పాటైన వేదిక మీద పలు ఆసక్తికర దృశ్యాలు కనిపించాయి. ఆదిరెడ్డి సకుటుంబ సమేతంగా రాజమహేంద్రవరం నుంచి భారీ సంఖ్యలో అనుచరగణం తరలిరాగా విజయవాడ చేరుకున్నారు. ఆదిరెడ్డి వెంట ఆయన సతీమణి, రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ మాజీ మేయర్ వీరరాఘవమ్మ, ఆయన కుమారుడు వాసు, కోడలు భవానీ, ఇద్దరు మనవళ్లు కూడా విజయవాడ వచ్చారు. ఆదిరెడ్డి అప్పారావు టీడీపీ దివంగత నేత ఎర్రన్నాయుడికి వియ్యంకుడన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తన వెంట అక్కడికి వచ్చిన ఎర్రన్నాయుడి కూతురు, తన కోడలు భవానిని ఆదిరెడ్డి... చంద్రబాబుకు పరిచయం చేశారు. ఈ సందర్భంగా ఎర్రన్నాయుడితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్న చంద్రబాబు... భవానీని ఆప్యాయంగా పలకరించిన అనంతరం ఆమె పిల్లలను ఆప్యాయంగా దగ్గరకు తీసుకుని వారితో సెల్పీ దిగారు.