: ఒకరిని విడిచి మరొకరు ఉండలేరు.. తుదిఘడియల్లోనూ చేతిలో చెయ్యేసి కన్నుమూసిన దంపతులు


పెళ్ల‌యి 58 ఏళ్లు గ‌డిచింది. త‌మ వివాహం జ‌రిగిన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టివ‌ర‌కు ఒక‌రంటే ఒక‌రు ప్రాణంగా బ‌తికారు. ఒక‌రిని విడిచి మ‌రొకరు ఉండ‌లేరు. ఆ ఆలోచ‌నే త‌మ మ‌దిలో రానివ్వ‌లేదు. చివ‌రికి చావు కూడా వారిని విడ‌దీయ‌లేక‌పోయింది. ఆ దంప‌తులిద్ద‌రూ పక్కపక్కనే పడుకొని, ఒకరి చేతులు ఒకరు పట్టుకొని క‌న్నుమూశారు. గ‌త‌వారం 58వ పెళ్లిరోజు వేడుక‌ల‌ను జ‌రుపుకున్న‌ టెక్సాస్‌లోని సాన్ అంటోనియోకు చెందిన ఈ దంపతులు ఇటీవ‌ల మ‌ర‌ణించారు. ఈ దంప‌తుల పేర్లు సాన్ జార్జ్, ఒరా లీ రోడ్రిగ్యుజ్. చిన్న‌త‌నంలోనే ఓ మాంసం మార్కెట్‌లో వీరిరువురికీ ప‌రిచ‌యం ఏర్ప‌డింది. ఒకే స్కూల్లో వీరిరువురు కలిసి చదువుకున్నారు. ఆ త‌రువాత‌ మిలిటరీలో పనిచేసిన జార్జ్ ఒరా లీని వివాహ‌మాడారు. వీరికి ముగ్గురు పిల్లలు జ‌న్మించారు. 58 ఏళ్ల వైవాహిక జీవితంలో తోడూ నీడగా బతికారు. చివ‌రికి వయస్సు మీద పడటంతో అనారోగ్యంతో బాధ‌ప‌డుతూ, ఎప్పటిలానే ఆ దంప‌తులు ప‌క్క‌ప‌క్క‌నే చేతిలో చేయి వేసి ప‌డుకున్నారు. నిద్ర‌లోనే జార్జ్ గుండెపోటు వ‌చ్చి ప్రాణాలు విడిచారు. ఆ త‌ర్వాత మూడు గంట‌ల‌కు ఒరా కూడా మరణించింది. ఈ విష‌యాన్ని వారి కూతురు కొరినా మార్టినెజ్ మీడియాకు చెప్పింది. ‘నోట్‌బుక్‌’ అనే హాలీవుడ్ మూవీలో దంప‌తులు క‌న్నుమూసిన విధంగానే త‌మ‌ తల్లిదండ్రులు ఒకేసారి ప్రాణాలు విడిచారంటూ ఆమె క‌న్నీరు పెట్టుకొంటూ పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News