: డబుల్ బెడ్ రూం ఇళ్ల పేరిట నయా మోసం!... నలుగురు సభ్యుల ముఠా అరెస్ట్!


తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన డబుల్ బెడ్ రూం ఇళ్లను ఆధారంగా చేసుకుని ఓ గ్యాంగ్ నయా మోసానికి పాల్పడింది. ఇళ్లు లేని నిరుపేలకు రెండు పడక గదులు, ఓ వంట గది, టాయిలెట్లతో కూడిన డబుల్ బెడ్ రూం ఇల్లును పూర్తిగా ప్రభుత్వ ఖర్చుతో నిర్మించి ఇస్తామని కేసీఆర్ సర్కారు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ పథకానికి సంబంధించి ఇప్పటికే పెద్ద సంఖ్యలో దరఖాస్తులు వెల్తువెత్తాయి. ఈ నేపథ్యంలో డబుల్ బెడ్ రూం ఇల్లు ఎక్కడ తమకు దక్కదోనన్న ఆందోళనలో ఉన్న పేద ప్రజలనే టార్గెట్ చేసుకున్న ఓ నలుగురు సభ్యుల ముఠా రంగంలోకి దిగిపోయింది. తమ మాయ మాటలతో ఇప్పటికే 110 కుటుంబాలను బుట్టలో వేసుకున్న సదరు ముఠా భారీ ఎత్తున డబ్బును వసూలు చేసింది. అయితే ఈ ముఠా మరింత విస్తరించకుండానే ఈ విషయం పోలీసుల చెవిన పడింది. దీంతో రంగంలోకి దిగిన టాస్క్ ఫోర్స్ పోలీసులు నిన్న రాత్రి పొద్దుపోయిన తర్వాత ముఠాలోని మొత్తం నలుగురు సభ్యులను అరెస్ట్ చేసింది.

  • Loading...

More Telugu News