: ఆఫ్గాన్‌లో కిడ్నాపర్ల చేర నుంచి బయటపడిన భారత మహిళ...నేడు ఢిల్లీ రాక!


గత నెల 9న ఆఫ్గనిస్థాన్‌లో కిడ్నాపైన భారత మహిళ జుడిత్ డిసౌజ(40) కిడ్నాపర్ల చెర నుంచి క్షేమంగా బయటపడినట్టు, నేడు ఆమెను ఢిల్లీకి తీసుకువస్తున్నట్టు విదేశీ వ్యవహారాల శాఖా మంత్రి సుష్మాస్వరాజ్ కొద్దిసేపటి క్రితం ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఆగాఖాన్ పౌండేషన్‌లో సీనియర్ టెక్నికల్ అడ్వైజర్‌గా పనిచేస్తున్న డిసౌజ గత నెలలో కాబూల్‌లో అదృశ్యమయ్యారు. ఉగ్రవాదులు ఆమెను కిడ్నాప్ చేసి ఉండొచ్చని భావించారు. డిసౌజాను రక్షించేందుకు ఆఫ్గనిస్థాన్, భారత్‌లు ప్రయత్నాలు ప్రారంభించాయి. నిజానికి ఆమె జూన్ 15న కోల్‌కతాలోని తన ఇంటికి చేరుకోవాల్సి ఉంది. అంతలోనే ఆమె అదృశ్యమయ్యారు. శుక్రవారం ఢిల్లీలో మంత్రి సుష్మాస్వరాజ్‌ను కలిసి డిసౌజా సోదరుడు.. తన సోదరిని రక్షించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే కుటుంబ సభ్యులు ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. ఆమె క్షేమంగా విడుదలైన సంగతి తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. సంతోషంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు.ఆఫ్గనిస్థాన్‌లోని భారతీయులు జాగ్రత్తగా ఉండాలని మేలోనే భారత రాయబార కార్యాలయం హెచ్చరికలు జారీచేసిన విషయం తెలిసిందే.

  • Loading...

More Telugu News