: ‘సచిన్ సాగా’ పేరుతో వీడియోగేమ్


క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ పేరిట త్వరలో ఒక వీడియో గేమ్ మార్కెట్లోకి రానుంది. ‘సచిన్ సాగా’ పేరిట ఈ వీడియోగేమ్ ను రూపొందిస్తున్నట్లు మహారాష్ట్రలోని పుణెకు చెందిన జెట్ సింథిసిస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఎండీ, వైస్ చైర్మన్ రాజన్ నవాని ప్రకటించారు. తమ సంస్థకు చెందిన ఆటల విభాగం ప్లేఈజ్ ఆన్ టెక్నాలజీస్ ‘సచిన్ సాగా’ వీడియో గేమ్ ను అందరినీ ఆకట్టుకునేలా రూపొందిస్తోందన్నారు. కాగా, ఈ విషయమై సచిన్ స్పందిస్తూ, తన తొలి డిజిటల్ గేమ్ రూపొందడం చాలా సంతోషాన్నిస్తోందని, పలు విభాగాల్లో తాను పాలుపంచుకున్నానని, డిజిటల్ గేమింగ్ ప్రపంచంలో సరికొత్త అనుభవాన్ని అందరం కలిసి ఆనందిద్దామని అన్నాడు.

  • Loading...

More Telugu News