: జగన్! జీవో లు చదవడం రాకపోతే ఎవరినైనా అడిగి తెలుసుకో: పయ్యావుల
వైఎస్సార్సీపీ అధినేత జగన్ కు జీవోలు చదవడం రాకపోతే ఎవరినైనా అడిగి తెలుసుకోవాలని టీడీపీ నేత పయ్యావుల కేశవ్ ఎద్దేవా చేశారు. రాజకీయ పార్టీలకు భూములిచ్చే నిమిత్తం తీసుకువచ్చిన జీవోను వైఎస్సార్సీపీ నేతలు తప్పుబట్టడం సరికాదన్నారు. కేంద్ర ప్రభుత్వం అనుసరించిన విధానాన్నే తమ ప్రభుత్వం కూడా అవలంబిస్తోందన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ కు భూముల కేటాయింపు కోసం జీవో తీసుకువచ్చారనడం సబబు కాదని అన్నారు. వైట్ కాలర్ క్రిమినల్స్ ను పక్కన పెట్టుకుని తిరగడాన్ని జగన్ మానుకోవాలని పయ్యావుల విమర్శించారు.