: భారత్, అమెరికాల మధ్య సమాచార మార్పిడి ఒప్పందం


భారత బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలలో పెట్టుబడి పెట్టిన అమెరికన్ల వివరాలు ఇక ఎంత మాత్రం దాగి ఉండవు. అలాగే భారతీయులు అమెరికాలో దాచిన సంపద వివరాలు తెలుసుకోవడమూ సాధ్యమవుతుంది. ఈ మేరకు ఇరు దేశాల మద్య ఒప్పందం కుదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించిన ప్రతిపాదిత ఒప్పందం స్టాక్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ పరిశీలనలో ఉంది. పన్నుల ఎగవేతను అరికట్టడంలో భాగంగా ఈ ఒప్పందం కుదుర్చుకుందామంటూ అమెరికా ఒత్తిడి తీసుకొస్తోంది. దీంతో కేంద్రం ఆదేశాల మేరకు సెబీ దీనిపై దృష్టి సారించింది. తగిన సూచనలు అందించాలని కేంద్రం ఆర్ బిఐను కూడా కోరింది.

  • Loading...

More Telugu News