: బిల్లుకి మద్దతివ్వాల్సిందే.. లేదంటే ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ ఉనికే లేకుండా పోతుంది: చిరంజీవి
ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా కోసం కేవీపీ పెట్టిన ప్రైవేటు బిల్లుకి బీజేపీ మద్దతు ఇవ్వాల్సిందేనని రాజ్యసభ సభ్యుడు, సినీనటుడు చిరంజీవి అన్నారు. పార్లమెంట్ ఆవరణలో ఆయన ఈరోజు మీడియాతో మాట్లాడుతూ.. బిల్లుపై ఓటింగ్ జరగకుండా బీజేపీ వంకలు వెతుకుతోందని అన్నారు. ‘బీజేపీ బిల్లుకి మద్దతు తెలిపి తీరాలి.. లేదంటే వారికి ఇబ్బందులు తప్పవు’ అని వ్యాఖ్యానించారు. మరోవైపు టీడీపీది కూడా అదే పరిస్థితి అని చిరంజీవి పేర్కొన్నారు. ఎన్నో పార్టీలు మద్దతు తెలుపుతున్నాయని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఏపీ శ్రేయస్సుని కోరుకుంటోందని ఆయన పేర్కొన్నారు. ‘బిల్లుకి మద్దతివ్వాల్సిందే.. లేదంటే ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ ఉనికే లేకుండా పోతుంది’ అని చిరంజీవి అన్నారు.