: బెజవాడ నుంచే విధులు నిర్వర్తిస్తా!... తేల్చిచెప్పిన ఏపీ కొత్త డీజీపీ!
నిన్నటిదాకా ఏపీ డీజీపీగా వ్యవహరించిన జేవీ రాముడు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాదు నుంచే విధులు నిర్వర్తించారు. అయితే నిన్న ఆయన నుంచి ఇన్ చార్జీ డీజీపీగా పదవీ బాధ్యతలు చేపట్టిన సీనియర్ ఐపీఎస్ అధికారి సాంబశివరావు మాత్రం రూటు మార్చేశారు. నేటి ఉదయం విజయవాడలో ఓ ప్రైవేటు న్యూస్ ఛానెల్ తో మాట్లాడిన ఆయన తాను విజయవాడ నుంచే విధులు నిర్వర్తిస్తానని పేర్కొన్నారు. ఏపీ ప్రభుత్వ పాలన దశల వారీగా నవ్యాంధ్ర నూతన రాజధానికి తరలుతున్న నేపథ్యంలో ఆయన చేసిన ప్రకటన ఉద్యోగుల్లో మరింత ఉత్సాహం నింపేలానే ఉందన్న వాదన వినిపిస్తోంది.