: ‘కబాలి’ తొలి ఆట టికెట్ దొరకలేదని అభిమాని ఆత్మహత్య
సూపర్ స్టార్ రజనీకాంత్ ‘కబాలి’ చిత్రానికి తొలి షోకు టికెట్ దొరకలేదని మనస్తాపం చెందిన ఒక అభిమాని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మలేషియాలో జరిగింది. మలేషియాలోని కేన్సిసీలోని పది అంతస్తుల భవనంపై నుంచి దూకి ఆ అభిమాని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, తమ అభిమాన నటుడి సినిమా రిలీజైన రోజే తొలి ఆట చూసేందుకని టికెట్ల కోసం అభిమానులు నానా పాట్లు పడుతున్నారు.