: కృష్ణా పుష్కరాలకు 358 ప్రత్యేక రైళ్లు ఏర్పాటు
వచ్చే నెల 12వ తేదీ నుంచి కృష్ణా పుష్కరాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. వివిధ మార్గాల్లో 358 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేశామని, రేపు ఉదయం 8 గంటల నుంచి రిజర్వేషన్లు ప్రారంభం కానున్నాయని చెప్పారు. ప్రత్యేక రైళ్ల వివరాలు... కృష్ణా కెనాల్- తిరుపతి, నర్సాపూర్- కృష్ణా కెనాల్, సికింద్రాబాద్- కృష్ణా కెనాల్, విజయవాడ-నర్సాపూర్, విజయవాడ- భద్రాచలం, మచిలీపట్నం- విజయవాడ, ఒంగోలు-కృష్ణా కెనాల్, రాజమహేంద్రవరం-రాయనపాడు, గద్వాల్-కర్నూలు సిటీ, బొల్లారం-గద్వాల్ మొదలైన మార్గాల్లో ప్రత్యేకరైళ్లను ఏర్పాటు చేశారు.