: వైఎస్సార్సీపీ నేతలూ.. విజయవాడకు బస్సు బుక్ చేస్తాం, రండి: టీడీపీ నేత వర్ల రామయ్య
‘పట్టిసీమ’తో నష్టపోతామంటున్న వైఎస్సార్సీపీ అధినేత జగన్, ఆ పార్టీ నేతలు విజయవాడ వచ్చేందుకు ఒక బస్సు ఏర్పాటు చేస్తామని, గోదావరి నీరు కృష్ణా నదికి ఏ విధంగా వచ్చి చేరుతుందో ప్రత్యక్షంగా చూడాలని టీడీపీ నేత వర్ల రామయ్య అన్నారు. హైదరాబాద్ లోని లోటస్ పాండ్ నుంచి ఈ బస్సు సౌకర్యం కల్పిస్తామని, ఆ పార్టీ నేతలు ఇక్కడికి రావాలంటూ వ్యంగ్య ధోరణిలో మాట్లాడారు. ‘పట్టిసీమ’పై అనుచిత వ్యాఖ్యలు చేసిన జగన్, ఈ పథకంతో ప్రయోజనం లేదన్నారని, ఇప్పుడేం సమాధానం చెబుతారని ఆయన ప్రశ్నించారు. ‘పట్టిసీమ’తో ఉపయోగం లేదన్న జగన్ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని రామయ్య డిమాండ్ చేశారు.