: తెలంగాణ ప్రాజెక్టులపై మరోసారి ఆరోపణలు గుప్పించిన నాగం
తెలంగాణలో చేపట్టిన ప్రాజెక్టుల పనులు అవినీతితో నిండిపోయాయని బీజేపీ తెలంగాణ నేత నాగం జనార్దన్ రెడ్డి మరోసారి ఆరోపించారు. ఈరోజు హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... ప్రాజెక్టుల పేరుతో గుత్తేదారులకు వేలకోట్లు ఇస్తున్నారని అన్నారు. మహబూబ్ నగర్ జిల్లాలోని నెట్టెంపాడు ఎత్తిపోతల పథకం రెండో లిఫ్ట్‌కు హరీశ్‌రావు ప్రారంభోత్సవం చేయడం పట్ల నాగం విమర్శలు గుప్పించారు. గత ప్రభుత్వాల హయాంలో నిర్మించిన ప్రాజెక్టులను హరీశ్‌రావు ప్రారంభించడం ఏంటని ఆయన ప్రశ్నించారు.