: రేపు రాజ్యసభలో ఏం జరిగినా దాని పరిణామాలకు బాధ్యత వహించాల్సింది మోదీ, చంద్రబాబే: సీపీఐ నారాయణ


రేపు రాజ్యసభలో ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకహోదా బిల్లు గెలిచినా, వీగినా తదనంతర పరిణామాలకు ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బాధ్యత వహించాల్సి ఉంటుందని సీపీఐ నేత నారాయణ తెలిపారు. కాంగ్రెస్ నేత కేవీపీ రామచంద్రరావు ప్రవేశపెట్టిన ప్రైవేటు మెంబర్ బిల్లుకు మద్దతివ్వాల్సిందిగా తమిళనాడు డీఎంకే నేత కనిమొళిని ఢిల్లీలో కలిసి కోరిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అధికారంలోకి రానంత వరకు మోదీ, చంద్రబాబు ఇద్దరూ ఏపీకి ప్రత్యేకహోదా హక్కు అని, ఏపీ ప్రజలకు ప్రత్యేకహోదా కల్పించేందుకు దేనికైనా వెనుకాడమని అన్నారని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చిన ఆ రెండు పార్టీలు ప్రత్యేకహోదాపై ప్రత్యేకభాష్యాలు చెబుతున్నాయని ఆయన మండిపడ్డారు. తాము రాజ్యసభలో ప్రైవేటు మెంబర్ బిల్లుకు మద్దతివ్వడంతో పాటు, రాష్ట్రంలో ప్రత్యేకహోదాపై తీవ్ర ఉద్యమానికి అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేస్తామని ఆయన చెప్పారు. ప్రజా ఉద్యమం సందర్భంగా ఏర్పడే ప్రతి సంఘటనకు ప్రధాని, ముఖ్యమంత్రి బాధ్యత వహించాలని ఆయన స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News