: దయాశంకర్ నాలుక తెగ్గోస్తే... రూ.50 లక్షల నజరానా!: బీఎస్పీ నేత సంచలన ప్రకటన
బహుజన సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ బహిష్కృత నేత దయాశంకర్ సింగ్ పై నిరసనలు వెల్లువెత్తున్నాయి. పార్టీ టికెట్లు డబ్బులకు విక్రయించుకుంటూ మాయావతి హీనాతిహీనంగా వ్యవహరిస్తున్నారంటూ కొన్ని అసభ్యకర పదాలను వాడిన దయాశంకర్ వ్యాఖ్యల పట్ల నిన్న పార్లమెంటు అట్టుడికింది. తాజాగా నేటి ఉదయం ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో బీఎస్పీ భారీ ఆందోళన నిర్వహించింది. ఈ క్రమంలో ఛండీగఢ్ లో జరిగిన ఆందోళనలో పాలుపంచుకున్న బీఎస్పీ మహిళా నేత జన్నత్ జహాన్ ఓ సంచలన ప్రకటన చేశారు. మాయావతిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన దయాశంకర్ నాలుకను తెగ్గోసి తెచ్చిన వారికి రూ.50 లక్షలను నజరానాగా అందజేయనున్నట్లు ఆమె ప్రకటించారు.