: వైసీపీ విప్ గా పిన్నెల్లి!... స్పీకర్ కు లేఖ రాసిన జగన్!


ఏపీ అసెంబ్లీలో విపక్ష హోదాలో ఉన్న వైసీపీ తనకు దక్కిన మరో పదవిని భర్తీ చేసింది. సభలో తన విప్ గా గుంటూరు జిల్లా మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని నియమిస్తూ ఆ పార్టీ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీ స్పీకర్ కు రాసిన లేఖలో ఈ విషయాన్ని వెల్లడించారు. పిన్నెల్లిని విప్ గా నియమించిన జగన్... మరోమారు యువ నాయకత్వానికే మద్దతుగా నిలిచినట్లైంది. ఇప్పటికే పీఏసీ చైర్మన్ పదవికి ఫస్ట్ టైం ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిని నియమించిన జగన్... తాజాగా విప్ గా మరో యువ నేతగా ఉన్న పిన్నెల్లిని ఎంపిక చేశారు.

  • Loading...

More Telugu News