: చైనా దూకుడుకు భారత సైన్యం అడ్డు... సరిహద్దులకు భారీగా బలగాల తరలింపు!


నిన్నమొన్నటి వరకూ అరుణాచల్ ప్రదేశ్ వైపు చొరబాట్లకు అధిక ప్రాధాన్యమిచ్చిన చైనా, ఇప్పుడు మంచుకొండలు దాటి కాశ్మీర్ వైపున ఉన్న లడఖ్ ప్రాంతంపై కన్నేయడంతో భారత సైన్యం అప్రమత్తమైంది. కార్కోరమ్ పాస్ నుంచి మొదలయ్యే 826 కిలోమీటర్ల వాస్తవాధీన రేఖ వెంబడి ట్యాంకర్లు, అత్యాధునిక ఆయుధాలను మోహరిస్తోంది. సరిహద్దుల్లో కాపలాగా ఉండాల్సిన సైనికుల సంఖ్యను పెంచడంతో ఈ ప్రాంతంలో బూట్ల చప్పుళ్లు పెరిగాయి. దీంతో ఈ ప్రాంతానికి మరిన్ని బలగాలను పంపాలని కూడా భారత ఆర్మీ నిర్ణయించింది. సముద్ర మట్టానికి దాదాపు 15 వేల అడుగుల నుంచి 20 వేల అడుగుల ఎత్తున ఉండే ఈ ప్రాంతంలో విధి నిర్వహణ అత్యంత క్లిష్టతరం. ఇక ఈ ప్రాంతంలోకి చైనా సైన్యం చొచ్చుకొస్తుండటం ఆందోళన కలిగిస్తుండగా, సరిహద్దుల్లో పది అడుగులకు ఒకరు చొప్పున చైనా, భారత సైన్యాలు నిలుచున్న దృశ్యాలు నిత్యమూ కనిపిస్తున్నాయి. చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ సైతం మరింత సైన్యాన్ని మోహరిస్తోంది. ఈ ప్రాంతానికి ఆయుధాలను చేరుస్తోంది. చైనాకు అడ్డుకట్ట వేయడంతో పాటు తన భారత హక్కులను కాపాడుకోవడమే లక్ష్యంగా ఇండియా వ్యూహాలను రచిస్తోంది.

  • Loading...

More Telugu News