: యూఎస్ నుంచి వచ్చి తెలుగుదేశంలో చేరితే, పార్టీ వాళ్లే వేధించి చంపారు: భర్త మరణంపై మాచర్ల మునిసిపల్ చైర్ పర్సన్ శ్రీదేవి


తెలుగుదేశం పార్టీ నేతల వేధింపులు, హత్య చేస్తామన్న బెదరింపులతో ఆందోళన చెందడం వల్లే తన భర్త గుండెపోటుతో మరణించాడని గుంటూరు జిల్లా మాచర్ల జిల్లా పరిషత్ చైర్ పర్సన్ శ్రీదేవి గుండెలవిసేలా రోదిస్తున్నారు. అమెరికాలో సుఖంగా ఉన్న తాము, ఇంక స్వస్థలానికి రావాలని భావించి మాచర్లకు వస్తే, నీచ రాజకీయాలకు బలిచేశారని ఆరోపించారు. అభ్యర్థులు ఎవరూ లేరంటూ, తన మామయ్య గోపవరపు బ్రహ్మయ్యకు ఉన్న పేరును గుర్తు చేస్తూ, తమ ఇంటి చుట్టూ తెలుగుదేశం నేతలు తిరిగారని, బలవంతం మీద తనను ఎన్నికల బరిలోకి దింపారని అన్నారు. ఆపై తాను చైర్మన్ గా ఎన్నికైన తరువాత, స్థానిక నేతల ఆగడాలు మొదలయ్యాయని, అడుగడుగునా రాజకీయాలు చేస్తూ, అభివృద్ధిని అడ్డుకోవడమే కాకుండా, తన భర్తపై, తనపై దుష్ప్రచారాలు చేశారని శ్రీదేవి ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ నేతలు రెండు వర్గాలుగా మారినట్టు తమ వద్ద నటించారని, పదవులు వదులుకొని ఇంట్ల కూర్చోకుంటే ఇబ్బందులు తప్పవని బెదిరించారని అన్నారు. ఈ ఆందోళనలతోనే తన భర్త గుండెపోటుతో మరణించారని ఆవేదనను వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News