: షాకిచ్చిన కార్పొరేటర్లకు వైసీపీ బెదిరింపులు!... పోలీసులకు కడప ‘గోపి’ల ఫిర్యాదు!


వైసీపీ టికెట్లపై కార్పొరేటర్లు ఎంపికై ఆ తర్వాత అధికార పక్షం పంచన చేరిన కడప నగరపాలక సంస్థకు చెందిన కార్పొరేటర్లకు బెదిరింపు ఫోన్ కాల్స్ వస్తున్నాయట. వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంత జిల్లాకు చెందన సదరు కార్పొరేటర్లు బెదిరింపు ఫోన్ కాల్స్ కు జడిసి పోలీసులను ఆశ్రయించారు. వివరాల్లోకెళితే... కడప నగరపాలక సంస్థకు చెందిన 8 మంది కార్పొరేటర్లు ఇటీవలే టీడీపీలో చేరిపోయారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు వారికి స్వయంగా కండువాలు కప్పి పార్టీలోకి సాదర స్వాగతం పలికారు. ఆ తర్వాత కడపకు వెళ్లిపోయిన సదరు కార్పొరేటర్లకు వైసీపీ నేతల నుంచి బెదిరింపు ఫోన్ కాల్స్ వస్తున్నాయట. దీంతో బెంబేలెత్తిపోయిన ఆ కార్పొరేటర్లు నేరుగా కడప డీఎస్పీని నిన్న కలిశారు. తమకు బెరిదింపు కాల్స్ వస్తున్నాయని, తమకు ఏం జరిగినా దానికి బాధ్యులు వైసీపీ నేతలేనని వారు పేర్కొన్నారు. ఈ మేరకు వారు డీఎస్పీకి ఓ వినతి పత్రాన్ని అందజేశారు. దీంతో స్పందించిన డీఎస్పీ... ఇకపై బెదిరింపు కాల్స్ వస్తే రికార్డు చేసి తమకు అందజేయాలని, అవసరమైతే రక్షణ కల్పిస్తామని వారికి హామీ ఇచ్చారు.

  • Loading...

More Telugu News