: అక్టోబర్ 1 నుంచీ వంటగ్యాస్ సిలిండర్లకు మార్కెట్ రేటే?


వంటగ్యాస్ సిలిండర్లను బహిరంగ మార్కెట్ రేటుకే కొనుక్కునే రోజులు దగ్గర పడుతున్నాయి. వచ్చే అక్టోబర్ 1 నుంచీ ఎల్పీజీ వంటగ్యాస్ సిలిండర్లపై ఇస్తున్న సబ్సిడీని నేరుగా లబ్ధదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేసుకుంటోంది. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వ అధికారి ఒకరు వెల్లడించారు. ఇదే జరిగితే ప్రస్తుతం ఏడాదికి ఆరు సబ్సిడీ సిలిండర్ల మీద ప్రభుత్వం భరిస్తున్న సబ్సిడీని ఇక లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు జమ చేస్తుంది. దాంతో వినియోగదారులు మార్కెట్లో ఎంత రేటు ఉంటే అంతకే కొనుగోలు చేయాల్సి వస్తుంది.

వాస్తవానికి దేశంలో ఇప్పటికీ 25 శాతం కూడా ఆధార్ కార్డుల జారీ పూర్తి కాలేదు. మరి అక్టోబర్ 1 నాటికి అంటే సగం కూడా ఆధార్ లక్ష్యం పూర్తికాదు. సాక్షాత్తూ ఆధార్ కార్డుల జారీని పర్యవేక్షిస్తున్న యునిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ చైర్మన్ నందన్ నీలేకనీ రెండు రోజుల కిందటే, 2014 నాటికి దేశంలో సగం మేర ఆధార్ కార్డుల జారీని పూర్తి చేస్తామని ప్రకటించారు. మరి వాస్తవాలు ఇలా ఉంటే కేంద్ర ప్రభుత్వం అక్టోబర్ 1 నుంచే దేశవ్యాప్తంగా ఎల్పీజీ సబ్సిడీని ఆధార్ తో ఎలా ముడిపెడుతుందనేది సందేహంగా మారింది.

  • Loading...

More Telugu News