: 24న హైదరాబాద్ నార్త్ జోన్ లోని బార్లు, మద్యం దుకాణాల మూసివేతకు ఆదేశాలు
ఈ నెల 24వ తేదీన సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలు సందర్భంగా బార్లు, మద్యం దుకాణాలు మూసివేయనున్నారు. హైదరాబాద్ నగర సీపీ మహేందర్ రెడ్డి ఈరోజు మీడియాతో మాట్లాడుతూ, 24వ తేదీ ఉదయం 6 గంటల నుంచి 26వ తేదీ ఉదయం 6 గంటల వరకు బార్లు, మద్యం దుకాణాలు మూసివేయాలని ఆదేశించారు. నార్త్ జోన్ లోని పది పోలీస్ స్టేషన్లలో పరిధిలో, మధ్య మండలంలోని రెండు పోలీస్ స్టేషన్ల పరిధిలోని మొత్తం బార్లు, మద్యం దుకాణాలు ఈ ఆదేశాలు తప్పకుండా పాటించాలన్నారు.