: నీస్ దాడిలో 84 మంది మృతదేహాలను వారి కుటుంబాలకు అందజేశాం: ఫ్రాన్స్
ఫ్రాన్స్ లో చోటుచేసుకున్న 'నీస్' నరమేధంలో మరణించిన 84 మంది మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అందజేశామని ఫ్రాన్స్ తెలిపింది. బాస్టిల్ డే ఘటనలో మృతుల సంఖ్య పెరిగిందన్న ప్రచారంలో వాస్తవం లేదని అధికారులు వెల్లడించారు. మృతుల్లో ఫ్రాన్స్ దేశీయులే కాక విదేశాలకు చెందినవారు కూడా ఉన్నారని ఫ్రాన్స్ ప్రాసిక్యూషన్ కార్యాలయ అధికార ప్రతినిధి తిబాల్ట్ తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, నీస్ ఘటనలో మృతి చెందిన 84 మందిని గుర్తించామని అన్నారు. ఆ 84 మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అందజేశామని ఆయన చెప్పారు. బాస్టిల్ డే ఉత్సవాల సందర్భంగా ఐఎస్ఐఎస్ ఉగ్రవాది భారీ ట్రక్ ను ప్రజలపైకి నడిపి 84 మంది మృతికి కారణమైన సంగతి తెలిసిందే.