: దీపిక భర్త పాత్రలో షాహిద్ కపూర్?


బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ రూపొందించనున్న చారిత్రాత్మక గాథ 'పద్మావతి' భర్త రాజా రావల్ రతన్ సింగ్ పాత్రపై సస్పెన్స్ వీడలేదు. టైటిల్ రోల్ ను దీపికా పదుకునే పోషిస్తుండగా, ఆమె ప్రియుడి పాత్రలో రణ్ వీర్ సింగ్ ను ఖరారు చేశారు. అయితే 'పద్మావతి' భర్త రాజా రావల్ రతన్ సింగ్ పాత్రలో 'మసాన్' నటుడు విక్కీ కౌశల్ నటించనున్నాడని నిన్నటి వరకు వార్తలు వినిపించాయి. అయితే తాజాగా షాహిద్ కపూర్ ఈ పాత్రను పోషించనున్నట్టు సమాచారం. సంజయ్ లీలా భన్సాలీ నుంచి ఆఫర్ రావడంతో షాహిద్ కపూర్ కూడా ఎగిరి గంతేసి ఒప్పుకున్నట్టు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News