: నా కుటుంబ సభ్యుల సంఖ్య పెరుగుతోంది... మరో బేబీ వస్తోంది!: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్
తన కుటుంబ సభ్యుల సంఖ్య చిన్నగా పెరుగుతోందని.. మరో బేబీ త్వరలో కొత్తగా వచ్చి చేరుతుందని.. ఈ విషయాన్ని చెప్పడం తనకెంతో సంతోషంగా ఉందని స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అన్నాడు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఒక ఫొటోను పోస్ట్ చేశాడు. ఆ ఫొటోలో బన్నీ తన కొడుకును ఎత్తుకుని ఉండగా.. ప్రెగ్నెంట్ అయిన తన తల్లి స్నేహారెడ్డి పొట్టపై అయాన్ ముద్దాడుతున్నాడు. కాగా, అల్లు అర్జున్, స్నేహా రెడ్డిలు ప్రేమ వివాహం చేసుకోవడం, వారికి మొదటి సంతానంగా అయాన్ జన్మించడం తెలిసిందే.