: ప్రైవేటు మెంబర్ బిల్లు వల్ల ఒరిగేదేమీ లేదు: కేటీఆర్


ప్రైవేటు మెంబర్ బిల్లు వల్ల ఒరిగేదేమీ ఉండదని తెలంగాణ మంత్రి కేటీఆర్ తెలిపారు. న్యూఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీలో పాగా వేసి, పలు పార్టీల నేతలను కలిసి, వారందరినీ ఒప్పించి రాష్ట్రాన్ని సాధించారని అన్నారు. ఏపీకి ప్రత్యేకహోదా కావాలంటే కూడా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అన్ని పార్టీలను ఒప్పించి సాధించుకోవాలని సూచించారు. ఈ ప్రైవేటు మెంబర్ బిల్లు వల్ల కాంగ్రెస్ పార్టీ సాధించేదేమీ ఉండదని ఆయన చెప్పారు. ఆ పార్టీకి నిజంగా చిత్తశుద్ధి ఉండి ఉంటే అప్పుడే బిల్లులో ఈ అంశాన్ని పెట్టి ఉండేవారని ఆయన అభిప్రాయపడ్డారు. కేవీపీ తలకిందులుగా తపస్సు చేసినా కాంగ్రెస్ పార్టీ బతికి బట్టకట్టే అవకాశం లేదని ఆయన పేర్కొన్నారు. తెలంగాణలో ప్రాజెక్టులను మహారాష్ట్రలోని ప్రాజెక్టులతో పోల్చి చూడడం కాంగ్రెస్ అవివేకానికి నిదర్శనమని ఆయన చెప్పారు. కరవు సమయంలో రిజర్వాయర్లే ఆదుకుంటాయని ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News