: ఆడుకుంటుండగా బాలుడి పాదంలోకి దిగిన గడ్డపార
పిల్లలు ఆటాడుకుంటుండగా ఓ బాలుడి పాదంలోకి గడ్డపార దిగిన ఘటన కరీంనగర్ జిల్లా సిరిసిల్లలో ఈరోజు చోటుచేసుకుంది. నాలుగేళ్ల ఓ బాలుడు తన ఇంటి సమీపంలో మిత్రులతో ఆడుకుంటున్నాడు. ఈ సమయంలోనే ఒక చిన్నారి గడ్డపారను భూమిలోకి గుచ్చుతున్నట్లు చూపిస్తున్నాడు. ఒక్కసారిగా ఆ గడ్డపార బాలుడి పాదంలోకి దిగింది. దానిని గమనించిన తల్లిదండ్రులు బాలుడిని దగ్గరలోని ఆసుపత్రికి చేర్చారు. బాలుడి పాదానికి శస్త్రచికిత్స చేసిన వైద్యులు ఆ గునపాన్ని తొలగించారు. బాలుడికి ఎటువంటి ప్రమాదం లేదని చెప్పారు.