: ఒక నేరగాడికి రెండు యావజ్జీవాలు ఏకకాలంలోనే!... లేదంటే జీవించే హక్కును హరించడమేనన్న రాజ్యాంగ ధర్మాసనం!
కోర్టులు విధించే శిక్షల అమలుకు సంబంధించి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీఎస్ ఠాకూర్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం నిన్న కీలక తీర్పు చెప్పింది. ఒకే నేరగాడికి రెండు వేర్వేరు నేరాల్లో రెండు యావజ్జీవ శిక్షలు పడితే... ఆ రెండింటినీ ఏకకాలంలోనే అమలు చేయాలని తేల్చిచెప్పింది. అలా కాని పక్షంలో ఒక వ్యక్తికి ఒకే జీవితం ఉంటుందన్న వాస్తవాన్ని కాలరాసినట్లేనని అభిప్రాయపడింది. రెండు వేర్వేరు నేరాల్లో పడిన రెండు యావజ్జీవ శిక్షలను ఒకదాని తర్వాత మరొకదానిని అమలు చేయాలని ఆదేశాలు జారీ చేయడం... అసంబద్ధమే కాకుండా అహేతుకమని ధర్మాసనం తేల్చిచెప్పింది. రెండు యావజ్జీవ శిక్షలు పడ్డ ఖైదీలకు రెండు శిక్షలను ఏకకాలంలో అమలు చేయాల్సిందేనని ఆదేశాలు జారీ చేసింది.