: నా పుట్టినరోజు రాత్రి... క్రిస్మస్ మార్నింగ్ లా ఫీలయ్యాను: బాలీవుడ్ బ్యూటీ ప్రియంక చోప్రా
‘నా పుట్టిన రోజు వేడుకలు జరిగిన ఆ రాత్రిని... క్రిస్మస్ పండగ రోజు ఉదయంలా ఫీలయ్యాను’ అని 34వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా చెప్పింది. టీవీ సిరీస్ ‘క్వాంటికో’ షూటింగ్ నిమిత్తం ప్రస్తుతం ప్రియాంక న్యూయార్క్ లో ఉంది. నిన్నరాత్రి తన పుట్టినరోజు వేడుకలను చాలా ఘనంగా జరుపుకున్నానని తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో పేర్కొంది. తనకు వచ్చిన బర్త్ డే గిఫ్ట్ లతో దిగిన ఒక ఫొటోను కూడా పోస్ట్ చేసింది. 16 గంటల పాటు షూటింగ్ లో పాల్గొనప్పటికీ ఎంతో ఉత్సాహంగానే ఉన్నానని పేర్కొంది. తనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేసిన వారందరికీ తన కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని చెప్పింది.