: 500 కోట్లు దాటిన 'సుల్తాన్' వసూళ్లు


బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ 'సుల్తాన్' సినిమా కలెక్షన్లలో 'సుల్తాన్' గానే నిలిచింది. ఈ చిత్రం విడుదలైన 12 రోజుల్లోనే 500 కోట్ల రూపాయల వసూళ్లతో దూసుకుపోతోంది. 500 కోట్ల రూపాయలు వసూలు చేసిన ఐదో సినిమాగా రికార్డు పుటలకెక్కింది. 'పీకే' 792 కోట్ల వసూళ్లతో అగ్రస్థానంలో ఉండగా, 'భజరంగీ భాయ్‌ జాన్' 626 కోట్ల రూపాయలతో ద్వితీయ స్థానంలోనూ, 600 కోట్ల రూపాయలతో 'బాహుబలి' మూడో స్థానంలో నిలవగా, 'ధూమ్ 3' 542 కోట్ల రూపాయలతో నాలుగో స్థానంలో నిలవగా ఐదో సినిమాగా 500 కోట్లతో 'సుల్తాన్' చేరింది. 500 కోట్ల క్లబ్బులో సల్మాన్ సినిమాలు రెండు చోటు దక్కించుకున్నాయి. కాగా, 'సుల్తాన్' కలెక్షన్ల జోరు తగ్గకపోవడంతో మిగిలిన సినిమాలను దాటేయడం ఖాయమని సినీ విశ్లేషకులు పేర్కొంటున్నారు. అయితే 'పీకే' రికార్డులను దాటే అవకాశం లేదని వారు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News