: ఏపీలో మరో ‘పట్టిసీమ’!... పోలవరం ఎడమ కాలువపై ఎత్తిపోతలకు సర్కారు నిర్ణయం!


దేశంలో తొలిసారిగా నదుల అనుసంధానం చేసిన రాష్ట్రంగా ఏపీకి ఖ్యాతి దక్కింది. గోదావరి జలాలను కృష్ణా నదిలో కలిపేందుకు చంద్రబాబు సర్కారు పోలవరం ప్రాజెక్టు కుడి కాలువపై పశ్చిమగోదావరి జిల్లా పట్టిసం వద్ద ‘పట్టిసీమ’ పేరిట ఎత్తిపోతల పథకాన్ని నిర్మించింది. స్వల్ప వ్యవధిలోనే ఈ ప్రాజెక్టును పూర్తి చేసిన చంద్రబాబు ప్రభుత్వం గతేడాదే గోదావరి జలాలను కృష్ణాలో కలిపేసింది. తాజాగా మరో ‘పట్టిసీమ’కు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ ప్రాజెక్టు కూడా పోలవరం జాతీయ ప్రాజెక్టుపైనే రానుండటం గమనార్హం. పోలవరం ఎడమ కాలువపై ఎత్తిపోతల పథకాన్ని నిర్మించేందుకు ఏపీ సర్కారు ప్రాథమికంగా నిర్ణయం తీసుకుంది. సాగర నగరం విశాఖకు తాగు నీరు, విశాఖ స్టీల్ ప్లాంట్ కు అవసరమైన నీరు కోసమే ఈ ప్రాజెక్టుకు రూపకల్పన జరుగుతోంది. ప్రభుత్వ ఆదేశాలతో ఇప్పటికే ఎడమ కాలువను పరిశీలించిన ఇంజినీరింగ్ నిపుణుల బృందం... పశ్చిమగోదావరి జిల్లా పురుషోత్తమపురం వద్ద ఈ ఎత్తిపోతలను నిర్మించేందుకు కార్యాచరణను సిద్ధం చేసింది.

  • Loading...

More Telugu News