: ఫేస్ బుక్ యూజర్లకు శుభవార్త... ఆఫ్ లైన్ సేవింగ్ ఫెసిలిటీ!


ఫేస్ బుక్ ను స్మార్ట్ ఫోన్ యూజర్లు అత్యధికంగా వినియోగిస్తున్నారు. దీంతో ఫేస్ బుక్ ఆఫ్ లైన్ ఫెసిలిటీని వాడుకునేందుకు వారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వీటిని పారద్రోలేందుకు ఫేస్ బుక్ నడుం బిగించింది. యూజర్లను మరింత ఆకట్టుకునేందుకు సరికొత్త సౌకర్యాన్ని వినియోగంలోకి తీసుకువచ్చింది. ఈ మేరకు సరికొత్త యాప్ ను తయారు చేసింది. దీనిని ఇన్ స్టాల్ చేసుకునే వినియోగదారులు, యూట్యూబ్‌ వీడియోలను ఆఫ్ లైన్ లో సేవ్ చేసుకుని, తమ సమయానుకూలంగా చూసుకునే వెసులుబాటును కల్పించనుంది. ఈ మేరకు తయారు చేసిన యాప్ ను ప్రస్తుతానికి బీటా వర్షన్‌ కలిగి ఉన్న స్మార్ట్ ఫోన్లలో మాత్రమే లభ్యమవుతోంది. దీనిని అత్యధికులు ఉపయోగించే ఆండ్రాయిడ్ వర్షన్ లో తయారు చేసేందుకు సిద్ధమవుతోంది. ఇది అందుబాటులోకి వస్తే... ఆఫ్ లైన్ లో వీడియోలను సేవ్ చేసుకుని, ఇష్టమొచ్చినప్పుడు చూసుకునే వెలుసుబాటు కలుగుతుంది.

  • Loading...

More Telugu News