: రూట్ మారి శంషాబాద్ లో దిగిన చంద్రబాబు
కర్నూలు జిల్లాలో పుష్కరాలపై సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హెలికాప్టర్ లో విజయవాడ వెళ్లాల్సి ఉంది. అక్కడ పుష్కరఘాట్ లో నిర్వహించే హారతి కార్యక్రమంలో ఆయన పాల్గొనాలి. ఈ మేరకు శ్రీశైలం మల్లికార్జున స్వామిని దర్శించుకున్న అనంతరం ముఖ్యమంత్రి హెలికాప్టర్ లో విజయవాడ బయల్దేరారు. వాతావరణం అనుకూలించకపోవడంతో విజయవాడ వెళ్లాల్సిన బాబు హెలికాప్టర్ హైదరాబాదులోని శంషాబాదుకు దారి మళ్లించారు. దీంతో శంషాబాద్ విమానాశ్రయంలో దిగిన ఏపీ సీఎం, విమానంలో గన్నవరం బయల్దేరనున్నారు.