: తెలుగు సినిమాలు బోరింగ్... ఎప్పుడూ ఒకే తరహాలో వుంటాయి!: నిత్యా మీనన్


తెలుగు సినిమాల్లో పెద్దగా నటించకపోవడానికి ప్రత్యేక కారణాలు అంటూ ఏమీ లేవని నిత్యా మీనన్ చెప్పింది. తెలుగు సినిమాలన్నీ ఒకే తరహాలో సాగుతాయని చెప్పింది. 'హీరో అల్లరి చిల్లరగా తిరుగుతూ హీరోయిన్ వెంటపడతాడు. అతనిని హీరోయిన్ ప్రేమిస్తుంది. హీరోయిన్ ని ఇంటికి చేర్చడమో లేక, విలన్ తో పగతీర్చుకోవడమో ఉంటుంది. అంతేగా?' అంటూ ప్రశ్నించింది. ఇలాంటి ఒకే తరహా సినిమాలు తెలుగులో వస్తాయని, తాను అలాంటి వాటిని బోరింగ్ గా ఫీలవుతానని చెప్పింది. అలా ఒకే తరహా సినిమాల్లో నటించడం వల్ల ఆనందం, సంతృప్తి రావని చెప్పింది. తాను విభిన్నంగా ఉన్న సినిమాలలో నటిస్తానని, మూస సినిమాల్లో నటించడం తనకు ఇష్టం ఉండదని చెప్పింది. తమిళంలో విక్రమ్ సరసన ఒక సినిమాలోను, కన్నడలో సుదీప్ సరసన ఒక సినిమాలోను నటిస్తున్నానని, అవి రెండూ తెలుగులో కూడా విడుదలవుతాయని చెప్పింది. ఈ రెండు సినిమాలు విభిన్న కథాంశంతో నడుస్తాయని తెలిపింది.

  • Loading...

More Telugu News