: ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాముడు పదవీ కాలం పొడిగింపు?
ఆంధ్రప్రదేశ్ డీజీపీ జేవీ రాముడు పదవీ కాలాన్ని మరో రెండు నెలలపాటు పొడిగింపు దిశగా ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. జూలై 31తో ఆయన పదవీ కాలం ముగియనున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోనుంది. కీలకమైన పుష్కరాల పనులు కూడా ప్రారంభం కానున్న నేపథ్యంలో ఎలాంటి భద్రతా సమస్యలు తలెత్తకుండా ఆయన పదవీ కాలం మరో రెండు నెలలపాటు పొడిగించనున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు ఏపీ గవర్నమెంట్ ఉత్తర్వులు జారీ చేయనున్నట్టు సమాచారం.