: కాసులు కురిపిస్తున్న ట్వీట్లు... కోట్లలో ఆదాయం పొందుతున్న యువకుడు!


ప్రస్తుతం చాలా మంది జీవితాలు సామాజిక మాధ్యమాలతో ముడిపడి ఉన్నాయి. ముఖ్యంగా ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్ స్టాగ్రామ్ లాంటి సామాజిక మాధ్యమాల ద్వారా తమ సమాచారాన్ని షేర్ చేయడం, మిత్రులు, బంధువులు, కొత్త వ్యక్తుల సమాచారాన్ని పొందడం పరిపాటైపోయింది. ఈ నేపథ్యంలోనే క్రిస్ సాంచే అనే ఇరవై ఐదేళ్ల యువకుడు సరదాగా సోషల్ మీడియాలో ‘ఉబర్ ఫ్యాక్టర్’ పేరిట తన ఖాతా తెరిచాడు. చాలా మందికి తెలియని విషయాలను అందులో పోస్ట్ చేస్తుండేవాడు. దీంతో, అతని ఫాలోవర్స్ సంఖ్య పెరిగిపోయింది. ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్ స్టా గ్రాం ఖాతాలలో మొత్తం కోటి ఎనభై లక్షల మంది అతనికి ఫాలోవర్లుగా ఉన్నారు. ఈ విషయాన్ని పసిగట్టిన కొన్ని ప్రచురణ సంస్థలు క్రిస్ తో టై అప్ పెట్టుకున్నాయి. ఆ ప్రచురణ సంస్థలు కొన్ని ఆసక్తికరమైన అంశాలను క్రిస్ కు అందజేయడం, వాటిని అతను తన సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేయడం.. ఈ అంశాలకు సంబంధించిన మరింత సమాచారం కోసం సదరు ఫాలోవర్లు ప్రచురణ సంస్థల వెబ్ సైట్లను ఆశ్రయిస్తుండటం జరుగుతోంది. ప్రచురణ సంస్థల వెబ్ సైట్లను క్రిస్ ఫాలోవర్లు ఎంతమంది అయితే చూస్తారో అంతకు సరిపడా డబ్బును లెక్క గట్టి సదరు సంస్థలు ఇస్తున్నాయి. అంతేకాకుండా, పలు సంస్థల ఉత్పత్తులు, సినిమాలకు సంబంధించిన సమాచారాన్ని కూడా క్రిస్ తన ఖాతాలో పోస్ట్ చేస్తూ తద్వారా కూడా ఆదాయాన్ని పొందుతున్నాడు. ఈ మార్గాల్లో ఏడాదికి రూ.3 కోట్లకు పైగా ఆదాయం సంపాదిస్తూ క్రిస్ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు.

  • Loading...

More Telugu News