: ఎట్టి పరిస్థితుల్లోనూ హుస్సేన్ సాగర్ లోనే నిమజ్జనం చేస్తాం... భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ కమిటీ


ఈ సంవత్సరం నుంచి హుస్సేన్ సాగర్ లో వినాయక విగ్రహాల నిమజ్జనం ఉండబోదని, శివారు ప్రాంతాల్లోని చెరువుల్లోనే నిమజ్జనం ఉంటుందని హైకోర్టుకు, తెలంగాణ ప్రభుత్వం హామీ ఇచ్చిన నేపథ్యంలో భాగ్యనగర్ ఉత్సవ కమిటీ ఘాటుగా స్పందించింది. హుస్సేన్ సాగర్ ను వాడుకోరాదని హైకోర్టు చెప్పలేదని, అన్ని చెరువుల్లో ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వాన్ని సూచిస్తూ ఇచ్చిన ఆదేశాల కాపీ తన వద్ద ఉందని కమిటీ నేత భగవంతరావు స్పష్టం చేశారు. ప్రభుత్వ వ్యాఖ్యలు కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీసేవిగా ఉన్నాయని, ఎట్టి పరిస్థితుల్లోనూ సంప్రదాయానుసారం హుస్సేన్ సాగర్ లో మాత్రమే ప్రధాన నిమజ్జనం ఉంటుందని ఆయన అన్నారు. కాగా, ఈ ఉదయం హైకోర్టులో నిమజ్జనం కేసు వాదనకు రాగా, కేసీఆర్ ప్రభుత్వం ఇకపై నిమజ్జనానికి హుస్సేన్ సాగర్ ను వాడబోమని వెల్లడించిన సంగతి తెలిసిందే. ఆపై కోర్టు కేసు తదుపరి విచారణను మూడు వారాల పాటు వాయిదా వేసింది.

  • Loading...

More Telugu News