: అడవుల దీవిలో యువతి అనుమానాస్పద మృతి
గుంటూరు జిల్లా నిజాంపట్నం మండలంలోని అడవుల దీవిలో ఒక యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. జాస్మిన్ (19) అనే యువతిని హత్య చేసి ఉరి వేసినట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ గ్రామంలోని ఇద్దరు యువకులు జాస్మిన్ ని హత్య చేశారనే అనుమానంతో వారిని గ్రామస్థులు చితకబాదారు. వారిద్దరినీ చెట్టుకు కట్టేసి దేహశుద్ది చేశారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు గ్రామానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.