: ఢిల్లీలో ముగిసిన అఖిలపక్ష సమావేశం
రేపటి నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో నేడు ఢిల్లీలో అఖిలపక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశం పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రి అనంత కుమార్ నేతృత్వంలో జరిగింది. అనంతరం అనంతకుమార్ మాట్లాడుతూ, పార్లమెంట్ సమావేశాలు సజావుగా సాగేందుకు విపక్షాలు సహకరించాలని ఎన్డీఏ కోరిందని, అందుకు అన్నీ పార్టీలు ప్రభుత్వానికి సహకరిస్తామని చెప్పాయని, అఖిలపక్ష సమావేశం సంతృప్తిగా జరిగిందన్నారు. ఇదిలా ఉండగా చెన్నైలో కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు మాట్లాడుతూ, ఈ సమావేశాల్లో జీఎస్టీ బిల్లు ఆమోదం పొందుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ బిల్లుతో అందరికీ మేలు జరుగుతుందని అన్నారు.