: సమావేశం మధ్యలోనే వెళ్లిపోయిన కేసీఆర్!


ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈరోజు ఢిల్లీలో జరిగిన అంతర్రాష్ట్ర మండలి సమావేశం మధ్యలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ లోని తన అధికార నివాసానికి వెళ్లిపోయారు. ఈ సమావేశానికి ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, యూపీ సీఎం అఖిలేష్ యాదవ్ గైర్హాజరు కాగా, కేసీఆర్ మధ్యలో లేచి వెళ్లిపోవడం ఆసక్తి రేపింది. అయితే సమావేశం సందర్భంగా మోదీతో మాట్లాడిన కేసీఆర్ తనకు జ్వరంగా ఉందని చెప్పి సమావేశం మధ్యలో వెళ్లిపోయారని తెలుస్తోంది. అనంతరం ముఖ్యమంత్రి ప్రసంగాన్ని తెలంగాణ సీఎస్ రాజీవ్ శర్మ చదివి వినిపించారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి రావాల్సిన నిధులను ఆ ప్రసంగంలో ప్రస్తావించినట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News