: అవినీతిలో ఏపీ నెంబర్ వన్ స్థానంలో ఉందన్న సి.రామచంద్రయ్య
ఏపీ అవినీతిలో నెంబర్ వన్ స్థానంలో ఉందని ఏపీ శాసనమండలిలో కాంగ్రెస్ పక్ష నేత సి.రామచంద్రయ్య అన్నారు. ఈ మేరకు కొద్దిసేపటి క్రితం విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. రాష్ట్రానికి కేంద్రం విడుదల చేసిన నిధులు, సీఎం చంద్రబాబు విదేశీ పర్యటనల కారణంగా అయిన ఖర్చులకు సంబంధించి శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.