: మెదక్- అక్కన్నపేట రైల్వే పనులను ప్రారంభించిన తెలంగాణ మంత్రి హరీశ్ రావు


మెదక్ జిల్లాలో మెదక్- అక్కన్నపేట రైల్వే లైను పనులను తెలంగాణ భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్ రావు కొద్దిసేపటి క్రితం ప్రారంభించారు. సుదీర్ఘకాలంగా మెదక్ జిల్లా ప్రజలు కోరుతున్న ఈ లైను ఏర్పాటుకు ఇటీవలే కేంద్ర రైల్వే శాఖ ఆమోదం తెలిపింది. దీంతో వెనువెంటనే పనులు ప్రారంభించినట్లు హరీశ్ రావు చెప్పారు. ఈ రైల్వే లైను పూర్తయితే మెదక్ జిల్లా ప్రజల చిరకాల వాంఛ తీరినట్లేనని ఆయన ఈ సందర్భంగా అన్నారు.

  • Loading...

More Telugu News