: బెయిల్ షరతులో భాగంగా ఉదయ్ పూర్ కు వెళుతున్న హార్దిక్!
గుజరాత్ లోని పటేల్ సామాజిక వర్గానికి రిజర్వేషన్లు ప్రకటించాలంటూ డిమాండ్ చేసిన ఉద్యమ సింహం, గుజరాత్ యువ సంచలనం హార్దిక్ పటేల్ కు రాజద్రోహం సహా పలు కేసులు స్వాగతం పలికాయి. ఈ కేసుల్లో 9 నెలలకు పైగా జైలు జీవితం గడిపిన ఆయన నిన్న బెయిల్ పై బయటకొచ్చారు. అయితే ఆరు నెలల పాటు రాష్ట్రానికి దూరంగా వుండే షరతుకు హార్దిక్ అంగీకరించిన మీదటే కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ పై విడుదలైన నిందితుడు ఈ సమయంలో ఎక్కడ ఉంటానన్న విషయాన్ని కోర్టుకు తెలపాల్సి ఉంది. ఈ మేరకు తాను రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో తదుపరి ఆరు నెలల పాటు నివాసముండనున్నట్లు హార్దిక్ కోర్టుకు తెలిపారు. ఉదయ్ పూర్ లోని శ్రీనాథ్ నగర్ లోని ఓ ఇంటిలో తాను నివాసముండనున్నట్లు ఆయన కోర్టుకు సవివరమైన అడ్రెస్ ఇచ్చి వెళ్లిపోయారు.