: వనస్థలిపురంలో విషాధం!... సెల్ ఫోన్ లో మాట్లాడుతూ కరెంటు తీగలు పట్టుకుని బీటెక్ స్టూడెంట్ దుర్మరణం!
హైదరాబాదు శివారు ప్రాంతం వనస్థలిపురంలో నిన్న రాత్రి విషాధం చోటుచేసుకుంది. సెల్ ఫోన్ మాట్లాడుతూ తనను తాను మరిచిపోయిన ఓ బీటెక్ స్టూడెంట్ టెర్రస్ పైకి ఎక్కి చెట్టు కొమ్మ అనుకుని కరెంటు తీగలను చేతితో పట్టేసుకున్నాడు. దీంతో విద్యుత్ షాక్ కు గురైన సదరు విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో షాక్ తిన్న అతడి కుటుంబ సభ్యులు అతడిని ఆసుపత్రికి తరలించగా... చికిత్స పొందుతూ నేటి ఉదయం కన్నుమూశాడు. సెల్ ఫోన్ లో సరదాగా మాట్లాడుతూ లోకాన్నే మైమరిచిపోయిన అతడు కరెంటు తీగలని కూడా చూడకుండా వాటిని పట్టుకున్న వైనం నగర వాసులను షాక్ కు గురి చేస్తోంది.