: టర్కీలో అమల్లోకి వచ్చిన మార్షల్ చట్టం!... సైనిక తిరుగుబాటును ఖండించిన అధ్యక్షుడు!
టర్కీలో సైనిక తిరుగుబాటును ఆ దేశ అధ్యక్షుడు ఎర్డోగాన్ తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు సైనిక తిరుగుబాటు జరిగిన కాసేపటికి ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రస్తుతం దేశంలో పరిస్థితి అదుపులోనే ఉందని ఆయన ప్రకటించారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని కూల్చి పాలనా పగ్గాలను బలవంతంగా చేజిక్కించుకోవడాన్ని ఆయన దారుణమైన చర్యగా అభివర్ణించారు. మరోవైపు దేశం మొత్తాన్ని తమ అధీనంలోకి తీసుకున్నట్లు ప్రకటించిన సైన్యం... దేశంలో మార్షల్ లాను అమల్లోకి తెచ్చింది. అంతేకాకుండా దేశవ్యాప్తంగా కర్ఫ్యూ విధిస్తున్నట్లు కూడా సైన్యం ప్రకటించింది.