: శుభవార్త... తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు
వాహనదారులకు శుభవార్త. పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గాయి. గత కొంత కాలంగా అంతర్జాతీయ ముడి చమురు మార్కెట్ లో హెచ్చుతగ్గుల కారణంగా స్వల్పంగా తగ్గుతూ, భారీగా పెరుగుతూ వచ్చిన పెట్రోలు, డీజిల్ ధరలు ఈసారి కాస్త ఎక్కువగానే తగ్గాయి. లీటర్ పెట్రోలుపై 2.25 పైసలు, లీటర్ డీజిల్ పై 0.42 పైసలు తగ్గించినట్టు పెట్రోలియం కంపెనీల కన్సార్టియం తెలిపింది. గత ఆరు నెలల్లో లీటర్ పెట్రోలు ధరను భారీ మొత్తంలో తగ్గించడం ఇదే ప్రథమం.