: హరితహారం కోసం నెల జీతం విరాళంగా ప్రకటించిన కేటీఆర్
తెలంగాణలో పెద్ద ఎత్తున కొనసాగుతోన్న హరితహారం కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి కేటీఆర్ తన నెల జీతాన్ని విరాళంగా ప్రకటించారు. అన్ని మున్సిపాలిటీల్లో హరితహారం కార్యక్రమం అమలవుతోన్న అంశంపై ఈనెల 18న వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. మున్సిపాలిటీల్లో హరితహారం కార్యక్రమం కొనసాగడానికి రూ.10 కోట్లు కేటాయిస్తున్నట్టు ఆయన తెలిపారు. హరితహారంపై మెరుగైన పనితీరు కనబరిస్తే ప్రత్యేక నిధులు కూడా కేటాయిస్తామని ఆయన తెలిపారు. హరితహారానికి కార్పొరేషన్ ఛైర్మన్లు, మేయర్లు, డిప్యూటీ మేయర్లు, ఛైర్ పర్సన్లు కృషి చేయాలని ఆయన సూచించారు.